పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. పలు రైళ్లు రద్దు!

-

పెద్దపల్లి జల్లాలోని రాఘవపురం- కన్నాల రైల్వే స్టేషన్‌ మధ్యలో ఘజియాబాద్ టు కాజీపేట వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు బోల్తా కొట్టడంతో ఆ రూట్‌లో ట్రాక్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఢిల్లీ-చెన్నై ప్రధాన మార్గంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా ప్రస్తుతం ట్రాక్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 20 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

అంతేకాకుండా మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ట్రాక్ పునరుద్ధరణ తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంతపూర్ ముజఫర్పూర్,కాచిగూడ నాగర్సోల్, కాచిగూడ కరీంనగర్, కరీంనగర్ కాచిగూడ, సికింద్రాబాద్ రామేశ్వరం, రామేశ్వరం సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి,తిరుపతి సికింద్రాబాద్, ఆదిలాబాద్ పర్లి, పార్లీ అదిలాబాద్, అకోల పూర్ణ, పూర్ణ అకోలా, ఆదిలాబాద్ నాందేడ్, నాందేడ్ ఆదిలాబాద్, నిజామాబాద్ కాచిగూడ, కాచిగూడ రాయచూర్,రాయచూర్ కాచిగూడ, గుంతకల్ బోధన్,బోధన్ కాచిగూడ, కాచిగూడ గుంతకల్ రైళ్లు రద్దయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news