లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ బయటపెట్టారు అధికారులు. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. బూంరాస్ పేట్ పిఎస్ లో FIR నమోదు చేశారు. 153/2024 క్రైం నెంబర్ కేసు పెట్టారు. సెక్షన్ 61(2) 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదు నమోదు చేశారు. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కూడా పెట్టారు. వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేశారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో మరో నలుగురిని రిమాండ్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆ నలుగురు నిందితులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారట. అనంతరం మళ్ళీ పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి కాసేపట్లో కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక అటు వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్‌లో పట్నం నరేందర్ రెడ్డిని ఇచ్చారు పోలీసులు. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. డీటీసీ సెంటర్‌కి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు అధికారులు. లగచర్ల దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. మెతుకు ఆనంద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొడంగల్ లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ pic.twitter.com/C1CHN5Jhur
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024