సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున జనాలు మోహరించడంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల కారణంగా ప్రతి రోజూ ఏదో ఒక విధంగా రైళ్లు రద్దవ్వడం, ఆలస్యంగా నడవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కేంద్రంగా నడిచే జమ్మూతావితో పాటు మరో మూడు రైళ్లు రద్దయ్యాయి..
వారంలో ఒకసారే ఈ ట్రైన్ నడుస్తుందని తెలుస్తోంది. జమ్మూ తావితో పాటు మరో మూడు రైళ్లు రద్దవ్వడంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.తమకు న్యాయం చేయాలని స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు. స్టేషన్ మాస్టర్ గది వెలుపల ప్యాసింజర్స్ ఆందోళనకు దిగడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారు స్టేషన్‌లోని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రైళ్లు క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.