కేసీఆర్, బీఆర్ఎస్‌ను లేకుండా చేస్తానంటవా : రేవంత్ పై కేటీఆర్ ఫైర్

-

కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన మూసీ పునరుజ్జీవనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ వల్లే మూసీ పాడైపోయినట్లు మాట్లాడుతున్నారని.. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు.బీఆర్ఎస్ హయాంలో రూ.4 వేల కోట్లతో అనేక చోట్ల ఎస్టీపీలు ఏర్పాటు చేశామన్నారు. గోదావరి నీళ్లను తీసుకొచ్చి మూసీలో కలపాలనుకున్నట్లు చెప్పారు.

కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు.గతంలో ఇలా మాట్లాడిన వాళ్లంతా తెలంగాణలో లేకుండా పోయారన్నారు.ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి మాటలు విని ఓటేసిన ప్రజలందరికీ క్లారిటీ వచ్చిందని.. చేతులు కాలినాక మోసపోయిన విషయాన్ని గ్రహించారని అన్నారు.రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశాడన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news