కల్తీలో హైదరాబాద్ నంబర్ 1గా నిలిచింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1 గా ఉండేదన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కల్తీలో హైదరాబాద్ నంబర్ 1గా నిలిచింది. బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు అధికారులు.
కల్తీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. దెబ్బతింటోందట. 19 నగరాల్లో సర్వే చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ విషయాన్ని తెలిపింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు అయినట్లు గుర్తించింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సిటీ హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో… 62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లు పేర్కొంది. సెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయి.. కల్తీపై చర్యలు తీసుకుంటున్నారు.