మూసీ పరివాహాక ప్రాంతాల్లో బీజేపీ నేతలు చేస్తున్న బస్తీ నిద్రపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే బీజేపీ ఇలాంటి స్టంట్స్ చేస్తుందన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ నేతలు తపిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా..? వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయం చేయడం కోసమే బీజేపీ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. ఒక రోజు నిద్ర చేయడం కాదు.. మూడు నెలలు నిద్ర చేస్తే నిరుపేదల బాధలు ఏంటో తెలుస్తాయని ఫైర్ అయ్యారు. 3 నెలలు బస్తీల్లోనే ఏం చేయాలో బీజేపీ నేతలే నిర్ణయించుకోవాలని మంత్రి తమ్మల కామెంట్ చేశారు.