తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న పురుషులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంపాదన వేటలో పడి కుటుంబ భారం మోసేందుకు కువైట్,సౌదీ వంటి దేశాల్లో పనులు చేసేందుకు వెళ్లిన తెలుగువారిని అక్కడి ఓనర్స్ నరకయాతన పెడుతున్నారు. తిరిగి ఇండియాకు పంపకుండా వేధిస్తున్నారు.తాజాగా మరో సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ‘నన్ను కాపాడండి, చంపేస్తానంటున్నారు అంటూ కువైట్ నుంచి కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ సెల్ఫీ వీడియోను బంధువులకు పంపింది.
కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ తాను అనుభవిస్తున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది.నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.. నన్ను కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది.గండేపల్లి మండలం యల్లమిల్లికి చెందిన గారా కుమారి భర్త మృతి చెందడంతో పిల్లల పోషణ, కుటుంబ భారం తనపై పడింది. దీంతో బతుకుదెరువు కోసం పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం.సుధాకర్ అనే ఏజెంట్ సాయంతో కువైట్లోని జబ్రాలి హమ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్లింది.
కువైట్ వెళ్లిన ఏడు నెలల్లోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్టు బాధితురాలు వీడియోలో వాపోయింది.
నన్ను చంపేస్తా అంటున్నారు.. కాపాడండి
నన్ను కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ
కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది.
నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా… pic.twitter.com/V7Jq6tT5b4
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024