సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశం వైరల్ అవుతూనే ఉంటుంది.అందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే మరికొన్ని ఎమోషనల్ ఉంటాయి. మరికొన్ని పొలిటికల్ సెన్సెషనల్, ఇంకొన్ని క్రైమ్ రిలేటెడ్.. క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకునే వీడియోలు.. క్షణాల్లోనే మృత్యువు కబలించిన ఘటనలు, ప్రపంచంలోని నలమూలలా జరిగే వింతలు, విశేషాలు అనేకం వెలుగుచూస్తుంటాయి.
తాజాగా సెలవులపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ కన్నతల్లికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతున్న తన తల్లి వద్దకు మాస్కు, క్యాప్ ధరించి వెళ్లిన జవాన్.. ముందు కస్టమర్ లాగా మాట్లాడి ఆ తర్వాత మాస్క్, క్యాప్ తొలగించడంతో పాపం.. ఆ తల్లి ఎంతో ఎమోషనల్ అయ్యింది. చాలాకాలం తర్వాత కొడుకును చూడగానే కంట కన్నీరు ఆగలేదు. భావోద్వేగానికి గురవుతున్న తల్లిని కొడుకు అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అమ్మకు ఆర్మీ జవాన్ స్వీట్ సర్‌ప్రైజ్
కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి
సెలవుల మీద వచ్చి అమ్మకు సర్‌ప్రైజ్ ఇచ్చిన జవాన్
చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో #ArmySoldier #viralvideo #Bigtv pic.twitter.com/FkuVn6TrVL
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024