జుట్టు ఆరబెట్టుకునేందుకు వాడే హీట్ డ్రైయర్ మిషన్ పేలడంతో ఓ వివాహిత తన రెండు చేతులను పొగొట్టుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోటలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు ఓ సైనికుడి భార్య వసవమ్మగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వాస్తవానికి పక్కింటి వాళ్లకు వచ్చిన కొరియర్ని బసవమ్మ తీసుకుంది.వారికి కాల్ చేయగా.. చెక్ చేయమని చెప్పారు. దీంతో బసవమ్మ హెయిర్ డ్రైయర్‌ను చెక్ చేసేందుకు పిన్ ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆమె రెండు చేతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైద్యులు డ్యామేజీ అయిన చేతులను తొలగించి కట్లు కట్టారు.ఈ ఘటనపై ఇల్కల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కర్ణాటక బాగల్ కోటలో విషాదం… హెయిర్ డ్రైయర్ పేలి రెండు చేతులు కోల్పోయిన సైనికుడి భార్య….
తీవ్ర గాయల పాలైన సైనికుడి భార్య బసవమ్మ.
పక్కింటి వాళ్లకు వచ్చిన కొరియర్ని తీసుకున్న బసవమ్మ.
చెక్ చేయమని చెప్పినా పక్కింటి వ్యక్తి.
చెక్ చేసేందుకు ఆన్ చేయగానే పేలుడు.
ఘటనపై ఇల్కల్… pic.twitter.com/X2inz8PEcz— ChotaNews (@ChotaNewsTelugu) November 21, 2024