IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ చేసుకున్నాడు. కేవలం 205 బంతుల్లో సెంచరీ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో యశస్వి జైస్వాల్…. ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ సాధించాడు ఓపెనర్ యశస్వి జైస్వాల్.
తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగిన 22 ఏళ్ల యువకుడు యశస్వి జైస్వాల్… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మెరుగైన ఫామ్‌ను కనబరిచి సెంచరీని అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్‌పై రాజ్‌కోట్‌లో అజేయంగా 214 పరుగులు చేశాడు ఓపెనర్ యశస్వి జైస్వాల్. స్వదేశంలో రెండు సెంచరీలు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్… విదేశాల్లో రెండు సెంచరీలు చేశాడు.