రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త జంటలకు అందజేసే కల్యాణలక్ష్మి చెక్కుల్లో గోల్మాల్ వ్యవహారంపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి స్థానిక అధికారులు, నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. కల్యాణలక్ష్మి చెక్కుల జారీ విషయంలో అధికారులు, నాయకులు బ్రోకర్ పని చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. చెక్కులు ఇప్పిస్తామని రూ.5 వేలు, రూ.10వేలు లంచం వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇంకోసారి ఎవరైనా అలా చేసినట్లు తెలిస్తే బొక్కలో వేసి తన్నిస్తా.. ఆ అధికారి, ఎంత పెద్ద లీడర్ అయిన సరే వారిని అస్సలు వదిలేది లేదన్నారు. బిజీనపల్లి మండలంలో కల్యాణలక్ష్మి చెక్‌ల పంపిణీ సందర్భంగా నాయకులు, అధికారులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధికారులకు, నాయకులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే వార్నింగ్..
కల్యాణలక్ష్మి చెక్ లో విషయం లో అధికారులు, నాయకులు బ్రోకర్ పని చేస్తున్నట్లు నా దృష్టి కి వచ్చింది..
చెక్ లు ఇప్పిస్తామని రూ.5 వేలు, రూ.10వేలు వసూలు చేస్తున్నారు..
ఇంకోసారి ఎవరైనా అలా చేసినట్లు తెలిస్తే బొక్కలు వేసి… pic.twitter.com/3D85hJnjHu— TV9 Telugu (@TV9Telugu) November 24, 2024