అదానీని శిక్షించే శక్తి భారత ప్రధాని మోడీకి ఉందా? అని సీపీఐ నారాయణ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ వేదికగా నారాయణ మాట్లాడుతూ.. అదానీపై నమోదైన లంచం కేసును అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందా? లేక అదానీకి మద్దతుగా మోడీ అడ్డుపడతారా? అన్నది వేచి చూడాలని అన్నారు.
ప్రస్తుతం అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అవినీతి పాకిందంటే ఆశ్చర్యంగా ఉందని సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇండియాలోని పలు రాష్ట్రాల్లో అదానీ నుంచి గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులకు వేల కోట్ల లంచం ఆశజూపారని అమెరికా సంచలన ప్రకటన చేసింది.అంతేకాకుండా అమెరికాలోకి కంపెనీల ఉన్నత అధికారులకు కూడా లంచం ఇచ్చారని ఆయన మీద కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే.