మద్యం మత్తులో ఓ ఆలయ చైర్మన్ హల్చల్ చేశాడు. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం చైర్మన్ నరసింహారెడ్డి మద్యం సేవించి రణరంగం సృష్టించాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములపై దుర్భాషలాడుతూ.. నేను ఆలయ చైర్మన్‌ని, నేను చెప్పినట్లు నడవాలంటూ బెదిరించారు. దీంతో స్వాములు నరసింహారెడ్డిపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలయ చైర్మన్ ప్రవర్తన తీరుపై ఆలయ సిబ్బందితో పాటు అయ్యప్ప స్వాములు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్ చైర్మన్ అయినంత మాత్రనా ఇలా మాలలో ఉన్న తమను ఎలా దుర్బాషలాడుతారని? ప్రశ్నించారు.ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప్పల్ పోలీసులను స్వాములు కోరారు.