భూ కబ్జా ఆరోపణలు.. నా ప్రమేయం ఉందని ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం!

-

తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎట్టకేలకు స్పందించారు. తాను భూదందాకు సహకరిస్తున్నానని తనపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. కావాలనే కొంతమంది మహిళలు తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఆరోపణలు నిరూపించకపోతే వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు.

గతంలో అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పుడు అరెస్టు అవుతున్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి, అతని కుమారుడు కూడా అరెస్ట్ కాబోతున్నాడని మంత్రి బాంబ్ పేల్చారు. తాను భూ కబ్జాకు పాల్పడినట్లు కొందరు రామచంద్రాపురంలో ధర్నాలు చేశారు. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రత్యర్థి వర్గం ఓటమిని జీర్ణించుకోలేక విపక్షంలో ఉండలేక కావాలపై తనపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news