మధ్యప్రదేశ్లో అతి దారుమైన ఘటన వెలుగుచూసింది. ఇటీవల రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నందున ప్రతిపక్షాలు ఆందోళనలు తీవ్రతరం చేశాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ప్రభుత్వ అంబులెన్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు.
మధ్యప్రదేశ్లోని మౌగాంజ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్,అతడి స్నేహితుడు కలిసి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కదులుతున్న వాహనంలోనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఇద్దరు నిందితులను పోలీసులను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.