ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బెంగాలీ క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి (21)పై పెద్ద పులి దాడి చేసింది. దీంతో యువతి మృతి చెందింది. విషయం తెలిసిన మృతురాలి బంధువులు, గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలాఉండగా, పెద్ద పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం. ఆడపులి కోసం పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో బయటకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు దండోరా వేయిస్తున్నారు.
ఆసిఫాబాద్లో పులి దాడి.. యువతి మృతి
ఆసిఫాబాద్ – కాగజ్ నగర్ మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి(21) పై పులి దాడి చేయడంతో మృతిచెందిన యువతి.
దీంతో మృతురాలి బంధువులు, గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు… pic.twitter.com/CrQPWFOUJn
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024