త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు – మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-

త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. శనివారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఆవులవాండ్లపల్లె, కావలి వాండ్లపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును వారికి అందజేశారు.

ram prasad reddy on ap pensions

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. గతంలో రాయచోటి నియోజకవర్గంలో ఎంతోమంది అనర్హులకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అసలు లబ్దిదారులకు అన్యాయం జరుగకుండానే.. అందరికీ న్యాయం చేస్తామని ప్రకటన చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news