PM Internship Scheme 2024: నిరుద్యోగ యువతీ యువకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. ఉద్యోగం చేయని వారికి 5000 రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్. పీఎం ఇంటర్షిప్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం లో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నేలకు 5000 రూపాయలు వచ్చేలా ప్లాన్ చేస్తోంది.
వన్ టైం గ్రాండ్ కింద 6000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈమెకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. నవంబర్ 30వ తేదీ 2024 లోపు ఇంటర్ షిప్ లో జాయిన్ అయినవారు ఈ పథకానికి అర్హులవుతారని తెలిపింది మోడీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా పలుక ప్రముఖ కంపెనీలలో ఇంటర్షిప్ కోసం లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారందరూ ఈ పథకానికి అర్హులవుతారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు సంబర పడిపోతున్నారు.