గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలనే ప్రజాప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం పై సోమవారం ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందిరమ్మ పాలన నిలుస్తున్నదని, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహ జ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని గుర్తుచేశారు.ఈ మంచి పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు.కాగా, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, నగరంలో కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు.