తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన ఫోటోతో కూడిన పోస్టును పెట్టారు. ‘నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తుందని’ కీర్తిస్తూ పోస్టు పెట్టారు. శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.
తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఉద్యమకారుడు శ్రీకాంత చారి 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో రాష్ట్ర సాధన కోసం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాంతచారి ప్రాణార్పనతో అప్పట్లో ప్రత్యేక ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి కాలక్రమేణా రాష్ట్రం అవతరించింది.