Authorities Siezed Stella Ship in Kakinada Port : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం..కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు ఏపీ అధికారులు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేశారు క లెక్టర్.
రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని ఈ సందర్భంగా కాకినాడ కలెక్టర్ షన్మోహన్ మాట్లాడారు.. షిప్ సీజ్ చేశాం.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని హెచ్చిరంచారు కాకినాడ కలెక్టర్ షన్మోహన్. అసలు ఆ రైస్ ఎక్కడ నుంచి వచ్చింది… ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నామన్నారు.