రాష్ట్రంలో దొంగతనాలు, అత్యాచారాలు, హత్యా ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని రంగంపేటలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకతీయ గ్రామీణ బ్యాంక్లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా అతడి కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి దుండగులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి, ఇనుప రాడ్లతో బాది హతమార్చారు.
అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై ఉన్న కారులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, నిందితులు పారిపోతున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.