రిపోర్టర్‌పై మోహన్‌బాబు దాడి.. 3 చోట్ల విరిగిన ఎముక !

-

మంచు మోహన్ బాబు నిన్న రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధిపై దాడి చేశారు మంచు మోహన్ బాబు. అయితే ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు. అతని ముక్కుకు అలాగే చెవికి మధ్య మూడు చోట్ల ఎముక ఫ్యాక్చర్ అయినట్లు… వైద్యులు చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీంతో అతనికి సర్జరీ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

mohanbabu-1

ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. మోహన్ బాబు పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాపై దాడి చేసినందుకుగాను మోహన్ బాబు పై కేసు పెట్టారు పోలీసులు. మోహన్ బాబు పై సెక్షన్ 118 బి ఎం ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇవాళ మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు మనోజ్, విష్ణు కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news