రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు..

-

దేశంలోని బ్యాంకులు అన్నింటికీ హెడ్ అయిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబుతో పేల్చేస్తామని గుర్తు తెలియని మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది.ఏకంగా ఆర్బీఐ గవర్నర్‌కే ఈ మెయిల్ వచ్చినట్లు తెలిసింది.రష్యన్‌ భాషలో దుండగుల బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

దీంతో ఆర్బీఐ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అలర్ట్ ప్రకటించారు. విచారణ పూర్తయ్యాక ఇది నార్మర్ బెదిరింపు మెయిల్ అని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉండగా, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news