హన్మకొండ జిల్లాలోని పద్మాక్షి గుట్ట సమీపంలో భారీ కొండచిలువ అనుకోకుండా ప్రత్యక్షమైంది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు దాదాపు అర్ధగంటకు పైగా శ్రమించి ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు.
ఆ తర్వాత హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌కు ఆ కొండ చిలువను తరలించారు. పద్మాక్షి గుట్ట సమీపంలోని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువను పార్క్‌లో ఉంచడం వలన సురక్షితంగా ఉంటుందని, పార్క్ వచ్చిన వారికి కనుమరుగు అవుతున్న జీవాలను చూసే అవకాశం లభిస్తు్ందని అధికారులు ఆలోచన చేశారు. అధికారుల నిర్ణయంపై యానిమల్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.