రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్నారట అధికారులు.
అయితే…. గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్ ను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పకుండా.. కూల్చే స్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. అటు హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగించడంపై నగర వాసులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు
ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు pic.twitter.com/JLzTypvE0S
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2024