ఒక్క ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు – హరీష్‌ రావు

-

తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఒక్క ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు అంటూ విమర్శలు చేశారు హరీష్‌ రావు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఒక్క ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు.

The debt incurred by Congress in one year of rule is Rs. 1,27,208 crores said Harish Rao

ఇలానే అప్పులు కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మొత్తం అప్పు కేవలం రూ. 4,17,496 కోట్లు మాత్రమే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు హరీష్ రావు. భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news