పాడి కౌశిక్ రెడ్డి..తాగి అసెంబ్లీకి వచ్చాడు – వేముల వీరేశం

-

పాడి కౌశిక్ రెడ్డి..తాగి అసెంబ్లీకి వచ్చాడంటూ బాంబ్‌ పేల్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం. పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శాసనసభకు తాగి వచ్చాడని మాకు అర్థం అవుతుందని చురకలు అంటించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. సభలో దళితుడైన స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారని ఆగ్రహించారు. తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు అంటూ వ్యాఖ్యానించారు.

కౌశిక్ రెడ్డికి నరనరాన కుల అహంకారమే ఉందని ఫైర్‌ అయ్యారు. దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు ? అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం రెచ్చిపోయారు.

అటు కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందని బాంబ్‌ పేల్చారు ఆది శ్రీనివాస్. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news