శ్రీ తేజ హెల్త్ బులిటెన్.. మళ్ళీ ఫీవర్ పెరిగుతోంది..!

-

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లి రేవంతి మరణించగా.. కొడుకు శ్రీ తేజ ప్రాణాలతో పోరాడుతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీ తేజ కు సంబధించిన హెల్త్ బులిటెన్ ను తాజాగా విడుదల చేసారు ఆసుపత్రి సిబ్బంది. ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం నిలకడగా ఉంది అని అందులో పేర్కొన్నారు.

అలాగే వెంటిలేటర్ , ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకోగాలుగుతున్నాడు అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫీవర్ పెరిగుతోంది అని ప్రకటించారు. అలాగే వైట్ బ్లడ్ సెల్స్.. మిగితా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫుడ్ తీసుకోగాలుగుతున్నాడు. కానీ నాడి వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉంది.. ఇంప్రూవ్ కాలేదు అని ప్రకటించారు. అయితే శ్రీ తేజ చికిత్సను మొత్తం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news