మెదక్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి

-

మెదక్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది కూడా సీఎం హోదాలోనే ఉంటా..క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటాను అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మెదక్ క్యాథెడ్రిల్ చర్చికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో మళ్ళీ ఈ చర్చికి వస్తాను… .మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని కోరారు.

CM Revanth participated in the centenary celebrations of Medak Church

పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు న్యాయం జరుగుతుందని…. ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువగా దళిత, గిరిజన క్రైస్తవులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పంట బోనస్ కూడా కర్షకులకు మా ప్రభుత్వం ఇస్తోందన్నారు. రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలని కోరారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఏ అవసరం ఉన్న మంత్రులు దామోదర, కొండా సురేఖ దృష్టికి తీసుకురండి.. అందరికి హ్యాపీ క్రిస్మస్ అని తెలిపారు. దేశంలోనే మెదక్ చర్చి గొప్ప చర్చి అని… మెదక్ చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news