జనవరి 3న ఇందిరా పార్కు దగ్గర సభ ఉంటుందని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. బీసీ సంఘాలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిందన్నారు. బీసీ ల కు రిజర్వేషన్లు ఫైనల్ చేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల కు వెళ్ళేటట్లు కనిపిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన విదంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇవ్వకుండా ఎన్నికల కు వెళితే… మా కార్యాచరణ వేరే విదంగా ఉంటుందని హెచ్చరించారు. బీసీ లకు రిజర్వేషన్లు డిసైడ్ చేసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. జనవరి 3 న ఇందిరా పార్కు దగ్గర సభ నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత.