ఇతరులు మనల్ని ఇష్టపడాలి అంటే ముందుగా మనల్ని మనం కూడా ఇష్టపడాలి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. ఇతరులు మనల్ని విమర్శించే ముందు మన పై మనకు ప్రేమ ఉంటే వాటిని లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. కనుక సెల్ఫ్ లవ్ ను పెంచుకోండి. అయితే వీటిని పాటిస్తే సెల్ఫ్ లవ్ ను పెంచుకోవచ్చు. వ్యాయామం చేస్తే హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ విధంగా ఆలోచనలు కూడా మారతాయి. ముఖ్యంగా వ్యాయామం చేయడంతో శరీరాకృతి కూడా బాగుంటుంది. ఈ విధంగా సెల్ఫ్ లవ్ పెరుగుతుంది.
చాలామంది బట్టలు సరిపోకపోవడం లేదని బరువు పెరిగిపోయానని భావిస్తారు. దానికి బదులుగా శరీరాకృతికి తగ్గట్టుగా బట్టలను ఎంచుకుంటే సరిపోతుంది అని అనుకోవాలి. ఇలా చేయడం వలన నచ్చిన దుస్తులు కూడా వేసుకోవచ్చు మరియు సౌకర్యంగా కూడా ఉండవచ్చు. దీంతో సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. ఎప్పుడైనా మనలో ఉండే భయాలను పోగొట్టుకోవాలి అనుకుంటే ఒకరితో పోల్చుకోకూడదు. అలా చేయకపోతే ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి. దీంతో చాలా బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉంటుందో అప్పుడు ఇతరులతో పోల్చుకున్న మన పై మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది.
సహజంగా మహిళలు ఇంట్లో ఉన్న అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు మరియు వారి పనులను కూడా పూర్తి చేస్తారు. కాకపోతే వారి విషయానికి వచ్చేసరికి ఎంతో నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దీంతో తక్కువ సమయంలోనే చాలా ఒత్తిడికి గురవుతారు. ఈ విధంగా యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే ఎన్ని పనులతో బిజీగా ఉన్నా కొంత సమయాన్ని మీకు ఇష్టమైన పనులను చేయడానికి కేటాయించండి. మీకు నచ్చినట్లు రెడీ అవ్వడం, షాపింగ్ కు వెళ్లడం, నచ్చిన వారితో మాట్లాడడం వంటి మొదలైన పనులు చేస్తే ఎంతో ఆనందంగా పాజిటివిటీతో జీవిస్తారు. దీంతో సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది.