ఒకే కుటుంబంలో ఐదుగురు కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన యూపీలోని మీరట్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. లిసారి గేట్ ప్రాంతంలో మోయిన్,అస్మా అనే దంపతులు కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కూతుర్లు అఫ్సా, అజీజా, ఆదిబా ఉన్నారు. ఏమైందో తెలీదు శుక్రవారం రాత్రి ఆ ఇంట్లోని వారంతా రక్తపు మడుగులో అచేతన స్థితిలో కనిపించారు.
దంపతులు ఇద్దరు ఇంట్లో రక్తపు గాయాలతో పడిపోయి కనిపించారు.ఇక పదేళ్లలోపు చిన్నారుల మృతదేహాలు మాత్రం మంచం కింద బాక్స్‌లో ప్యాక్ చేసి కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకుని కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. బలమైన రాడ్డుతో వారి తలల మీద కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీరట్ జిల్లా ఎస్పీ తెలిపారు.