కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుల వరకు చేరాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేర్చే బాధ్యత కలెక్టర్ లదే. ప్రభుత్వంకు మంచి పేరు రావాలన్నా.. చెడ్డపేరు రావాలన్నా.. కలెక్టర్ల పనితీరు పైనే ఆధారపడి ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక లో అత్యంత పారదర్శకంగా జరగాలి. కొంతమంది కలెక్టర్లు అసలు ఫీల్డ్ విజిట్ చేయడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సరిగ్గా మానిటర్ చేయలేదు. అలా అలసత్వంతో ఉన్న కలెక్టర్ల పై వేటు తప్పదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నారు.
అలాగే కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వంకు చెడ్డపేరు తెస్తున్నాయన్న సీఎం.. కలెక్టర్లు విజిట్ చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయన్నారు. ఇక నుంచి ప్రతీ వారం ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్లు విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు.