వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా : సీఎం రేవంత్

-

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలి. ప్రతీ మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలి. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదు అని తెలిపారు.

కాబట్టి అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలి. రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి. వీటితోపాటు విలేజ్ మ్యాప్ లను పరిశీలించి అధికారులు ఫీల్డ్ కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలి. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదు అని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news