తిరుపతి బాధిత కుటుంబాలకి రేపు చెక్ ల పంపిణీ..!

-

తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక కామెంట్స్ చేసారు. సీఎం ఆదేశాలు మేరకు ఈ టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించాం. అలాగే సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన 6 మంది భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చోప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం. తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం. ఇక గాయపడినమిహిళైనా భక్తులకు 2 లక్షల చోప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.

అయితే రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఈ చెక్ లు అందిస్తాం. అలాగే మృతి చెందిన భక్తుల కుటుంబంలో విద్యార్థులు ఉంటె వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారి కుటుంభంలోని వ్యక్తులకు ఉద్యోగాలు అవకాశం కల్పిస్తాం. అదే విధంగా జూడిషయల్ ఎంక్వయిరీలో భాద్యులును గుర్తించి వారి పై చర్యులు తీసుకుంటాం అన్నారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వ్యక్తిగతంగా పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా 10 లక్షలు విరాళంగా ఇవ్వగా.. 3 లక్షలు విరాళంగా ప్రకటించాటారు ఎంఎస్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news