నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో థమన్ మ్యూజిక్ కి స్పీకర్లు పడిపోయాయి. ఇది చూసిన మూవీ యూనిట్ పగలబడి నవ్వింది. సిబ్బంది మళ్లీ వాటిని యథాస్థానంలో నిలబెట్టారు. బాబీ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్ మాట్లాడారు. డాకు మహారాజ్ లో తన మ్యూజిక్ కి స్పీకర్లు కాలిపోతాయని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు థమన్ అన్నారు. బాలయ్య అంటూ వంద శాతం కష్టపడతాను. మా ఇద్దరి సినిమా అంటే స్పీకర్లు రెడీ గా పెట్టుకోండి. కాలతాయి అంతే.. ప్రీపేర్ అవ్వండి. మేము చేయలేం. సినిమాకు ఆ స్కోప్ ఉంది. నా మీద బాలయ్య కు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత డైరెక్టర్ బాబీ వేరే స్థాయికి చేరుకుంటారు” అని తెలిపారు థమన్.