తిరుమలలో కొంతమంది అధికారుల తప్పిదం వల్ల తోపులాట ఘటన జరిగింది. ఈ ఘటనలో బాద్యులైన వారీ పై కఠిన చర్యలు తీసుకుంటాం అని చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. శ్రీవారికీ సీఎం చంద్రబాబు భక్తుడు. నేను ఎవరితోనైనా పెట్టుకుంటాను కానీ స్వామి వారితో పెట్టుకొనని చాలా సార్లు చెప్పాడు. తోపులాట ఘటన పై సీఎం చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ సూచించిన సూచనలను కచ్చితంగా పాటిస్తాం. బోర్డు తప్పిదం లేకపోయ్యిన పాలకమండలి తరుపున క్షమాపణలు చెబుతున్నాం అని అన్నారు.
ఇక పై జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా పాలకమండలి భాగస్వామ్యం అవుతుంది. కొందరు అధికారులు అత్యుత్సహం వల్ల జరిగిన ఘటన ఇది. అధికారుల కూడా క్షమాపణ చెప్పాలి..వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. టీటీడికి బోర్డె సుప్రీం..సీఎం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చెయ్యాలి.సీఎం దృష్టికీ ప్రతి సమస్యను తీసుకెళ్తున్నాం అని బిఆర్ నాయుడు పేర్కొన్నారు.