ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బెజవాడ బస్టాండ్.. 148 అదనపు ఆర్టీసీ బస్సులు

-

బెజవాడ బస్టాండ్..ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులతో బెజవాడ బస్టాండ్కిక్కిరిసిపోయింది. ముందస్తు రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రయాణికులకు బస్సులు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. బెజవాడ బస్టాండ్..ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన తరుణంలో 148 అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసారూ అధికారులు.

On the occasion of Sankranti, the Bejawada bus stand was crowded with passengers

ఇది ఇలా ఉండగా, ఏపీ ప్రయాణికులకు బిగ్ అలెర్ట్. విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ వచ్చింది. సంక్రాంతి రద్దీతో బైపాస్‌ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ రావడంతో విజయవాడ నగరం మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తగ్గాయి. 30 నిమిషాల్లో విజయవాడను దాటేస్తున్నారు వాహనాలు.. గొల్లపూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర చినఅవుటుపల్లి మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్తున్నాయి వాహనాలు.

Read more RELATED
Recommended to you

Latest news