నేడు అయోధ్య రామ మందిరం తొలి వార్షికోత్సవం జరుగుతోంది. ఈ తరుణంలో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. భారతీయ సంస్కృతికి వారసత్వం అయోధ్య ఆలయం అన్నారు మోడీ. ఎన్నో శతాబ్దాల పోరాటాల తర్వాత ఆలయాన్ని నిర్మించామన్న మోడీ త్వేఈట్ చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామమందిరం ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ మొదటి వార్షికోత్సవాన్ని గత సంవత్సరం జనవరి 22న కాకుండా జనవరి 11, శనివారం నాడు పవిత్రోత్సవం జరుపుకుంటోంది.
ఆలయ ట్రస్ట్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, హిందూ మతంలో అన్ని పండుగలను హిందూ తేదీల ప్రకారం జరుపుకునే సంప్రదాయం ఉందని చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, పవిత్రోత్సవం పౌష్ శుక్ల పక్ష ద్వాదశి నాడు జరిగింది, దీనిని కూర్మ ద్వాదశి అని కూడా పిలుస్తారు (పౌష్ మాసం పౌర్ణమి చక్రంలో 12వ రోజు). 2025లో, హిందూ క్యాలెండర్ తేదీ జనవరి 11న వస్తుంది, కాబట్టి హిందూ క్యాలెండర్‌ను అనుసరించి 2025లో జనవరి 11న ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించారు. అందుకే నేడు అయోధ్య రామ మందిరం తొలి వార్షికోత్సవం జరుగుతోంది.