థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం..పొట్టెలును బలి ఇచ్చి !

-

డాకు మహారాజ్ సినిమా రిలీజ్‌ అయిన తరుణంలో థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం సృష్టిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. ఆ మూగ జీవాన్ని బలి ఇచ్చి దాని రక్తాని అద్ది డాకు మహారాజ్ పోస్టర్ కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Balayya fans anarchy at theaters when Daku Maharaj movie was released

సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ క్రమంలో కొన్ని చొట్ల ప్రీమియర్లు మొదలయ్యాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్(ఎక్స్) వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మాస్ ఎలివేషన్స్, పవర్ ప్యాక్డ్ బాలయ్య ఎంట్రీ సీన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాబీ స్టోరీ, డైరెక్షన్‌, టెక్నికల్ స్కిల్స్ అద్బుతమని ట్వీట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news