భోగి పండుగ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఆటంకాలు సృష్టించినా పేదోడి కలలను నెరవేర్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఉదయం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలు,రాజకీయాలతో సంబంధం లేకుండా జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు.ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకూ ఎకరాకు రూ.12 వేలను వారి అకౌంట్లో జమ చేస్తామని స్పష్టంచేశారు.