మోహన్ బాబు బౌన్సర్లు vs మనోజ్ బౌన్సర్లు..!

-

మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి మంచు మనోజ్ రావడంతో అక్కడ పరిస్థితులు టెన్షన్ గా మారిపోయాయి. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. ముందుగానే మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా సిబ్బంది మూసేసారు. అయితే మనోజ్ ను యూనివర్సిటీ లోపలికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో వారితో మనోజ్ వాదించారు. కానీ కోర్టు నోటీసులను మనోజ్ కు చూపుతున్నారు వర్సిటీ అధికారులు.

ఈ క్రమంలోనే మోహన్ బాబు బౌన్సర్లు vs మనోజ్ బౌన్సర్లు అన్నట్లు పరిస్థితి ఏర్పడింది. ఒకరినొకరు కొట్టుకున్నారు బౌన్సర్లు. దాంతో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అభిమనులను లాఠీలతో కొట్టి తరిమేశారు పోలీసులు. ఈ ఉద్రిక్తల మధ్య మనోజ్ తాతయ్య, నాయనమ్మ సమాధి వద్దకు పంపారు పోలీసుల. కానీ పోలీసులు లాఠీ ఛార్జ్ తర్వాత ఇరు వర్గాల బౌన్సర్లు ఒక్కరి పై మరొకరు రాళ్లు దాడులకు పాల్పడరు.

Read more RELATED
Recommended to you

Latest news