సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్‌ !

-

Saif Ali Khan Attack Suspect Brought To Bandra Police Station: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Saif Ali Khan Attack Suspect Brought To Bandra Police Station

బాంద్రా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడిని ఫోటోను పోలీసులు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆ దుండగుడు దొంగతనం కోసమే అతని ఇంట్లోకి వెళ్లారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే మార్గం ద్వారా దుండగుడు సైఫ్ నివాసంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిందితుడు దాడి చేసే ముందు సైఫ్ ని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు ఒప్పుకోకపోవడంతో దుండగుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news