“ఫ్రాడ్ కుక్క” అంటూ మంచు మనోజ్ సంచలన ట్వీట్

-

మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ల మధ్య వార్ రోజు రోజుకు రచ్చకెక్కుతోంది. ఇటీవల ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వెళ్లడంతో మరోసారి వివాదం రాజుకుంది. అయితే సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ ని లోపలికి పంపించేందుకు నిరాకరించారు.

 

దీంతో చాలామంది అభిమానులు అక్కడికి చేరుకొని గేటు తీయాలంటూ గొడవ చేయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇలా మంచు ఫ్యామిలీ వివాదం ముదిరిన తరుణంలో సోషల్ మీడియా వేదికగా విష్ణు ఓ పోస్ట్ చేశారు. ఆయన నటించిన “రౌడీ” సినిమాలోని ఓ డైలాగ్ ని పోస్ట్ చేశారు విష్ణు.

” సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ” అనే డైలాగ్ ని షేర్ చేశారు. అయితే ఈ డైలాగుని ఉద్దేశించి మంచు మనోజ్ తాజాగా ఓ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు” అంటూ విష్ణు కి కౌంటర్ ఇచ్చే విధంగా ట్వీట్ చేశారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news