కేంద్రానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ కీలక అభ్యర్థన

-

దివంగత మాజీ సీఎం, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శనివారం హైదారాబాద్‌‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్ఫగుచ్ఛాలు పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వడం వల్ల గౌరవం పెరుగుతుందని తాను భావించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఒక వేళ భారతరత్నను ప్రకటిస్తే ఆ అవార్డు స్థాయి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సైతం ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌‌కు భారతరత్న సాధించి తీరుతామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కాగా,ఏపీలోని కీలక రాజకీయ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news