తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్..ఆ కేసులు నమోదు !

-

 

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ 75, 79, 351(2), 196, 352, 353 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు రాప్తాడు పోలీసులు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ కేసులు నమోదు అయ్యాయి.

Case against Chandu, brother of former YCP MLA Topudurthi Prakash Reddy

గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో ఆఫీసులో చంద్రబాబు, లోకేష్ పై అమానవీయ వ్యాఖ్యలు చేశాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు. అప్పట్లో మొద్దు శ్రీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెప్పి ఉంటే.. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని చంపేవాడన్నారు తోపుదుర్తి చందు. దీంతో తోపుదుర్తి చందు వ్యాఖ్యలపై నాడు భగ్గుమన్నారు టీడీపీ నేతలు. నాడు టీడీపీ శ్రేణుల ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదట పోలీసులు. అయితే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోపుదుర్తి చందుపై అనంతపురం ఎస్పీకి టీడీపీ బీసీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news