రాష్ట్రంలో యాసంగి సాగు దగ్గరకు వచ్చినా సాగు నీరు లేకపోవడంతో చాలా చోట్ల వరి నాట్లు ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల వేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం నారాయణపూర్ గ్రామంలో నీళ్లు లేక పొలాలు ఎండిపోయి, బీట్లు వారాయి. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎండిపోయిన పొలాలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పరిశీలించారు.
కరెంట్ ఉండదు, నీళ్లు రావు..కాంగ్రెస్ వాళ్లను నమ్మి మోసపోయామంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.తులం బంగారం వద్దు, పెన్షన్లు వద్దు నీళ్లు ఇస్తే చాలని రైతులు తమ గోడును మాజీ ఎమ్మెల్యేకు వెల్లబోసుకున్నారు.ఈ క్రమంలోనే సుంకే రవి పర్యటనతో అధికారులు మేల్కొని ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు.