డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్ అయింది. నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ఈ తరుణంలోనే… డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం వాషింగ్టన్ చేరుకున్నారు దేశ విదేశీ ప్రతినిధులు. వాషింగ్టన్ డీసీలోని ఇండోర్ స్టేడియంలో ట్రంప్ ప్రమాణస్వీకారం ఉంటుంది.
మొదటగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అటు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. భారత్ తరపున ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి విదేశాంగమంత్రి జై శంకర్ హాజరుకానున్నారు. కాగా ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో… కమలా హరీస్ పైన డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ తరునంలోనే.. నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉండనుంది.