ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఉన్న స్కూళ్లకు కీలక ఆదేశాలు వచ్చాయి. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఏపీ లోని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఆరోజున అన్ని పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామారావు ఆదేశాలు జారీ చేశారు.
హెడ్మాస్టర్లు అలాగే విద్యాసంస్థల ప్రధాన అధికారులు ఈ గణతంత్ర వేడుకల్లో కచ్చితంగా పాల్గొనాలని హుకుం జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాక ఆవిష్కరణ చేస్తారని ఆయన తెలపడం జరిగింది. అదే సమయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ గీతాన్ని పాడడంతో పాటు.. మార్చ్ ఫాస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.